: ఆస్ట్రేలియాపై మైండ్ గేమ్ మొదలు పెట్టిన కోహ్లీ!

క్రికెట్లో ప్రత్యర్థి జట్లలోని ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా, మైదానంలో వారిని ఉడికిస్తూ, అవసరమైతే నోరు పారేసుకునే దేశాల జాబితాలో ఆస్ట్రేలియా ముందు వరుసలో నిలుస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో భారత్, ఆస్ట్రేలియాలు ఆడుతున్న వేళ, స్లెడ్జింగ్ ను వాడి కొన్నిసార్లు విజయవంతమైన ఆసీస్ ఆటగాళ్లు, నేడు జరిగే పోరులో సైతం అదే దారిలో వెళ్లవచ్చని క్రీడా పండితులు ఊహిస్తున్న వేళ, భారత స్టార్ క్రికెటర్ కోహ్లీ, వారికన్నా ముందుగానే మైండ్ గేమ్ ప్రారంభించాడు. "స్లెడ్జింగ్ పరిస్థితి నాకు ఎన్నోమార్లు ఎదురైంది. వారు ఎన్ని మాటలు అన్నా మైదానంలో నా మనసులో అలజడి సృష్టించలేరు. ఎవరైనా ఏదైనా అంటే, వెంటనే నా నుంచి సమాధానం వస్తుంది. అది ఆ క్షణాన నా ఆటతీరును ప్రభావితం చేయబోదు. ఒకరిని ఒకరు దూషించుకునే అవసరం లేకుండా ఆటాడాలని కోరుకుంటున్నా. ఒకవేళ ఆలాంటి పరిస్థితే వస్తే మాటకు మాటే సమాధానమవుతుంది" అన్నాడు. ఇక ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న అత్యంత కీలక పోరులో తిట్ల పురాణం ఎలా ఉంటుందో తెలియాలంటే, ఆరేడు గంటలు వేచిచూడాలి.

More Telugu News