: పది ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సఫారీలు

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో సఫారీలు తీవ్ర కష్టాల్లో పడ్డారు. కేవలం పది ఓవర్లలో సగం వికెట్లు కోల్పోయిన సఫారీలు విండీస్ బౌలర్ల ధాటికి దాసోహమయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ హషీమ్ ఆమ్లా (1), తరువాత డుప్లెసిస్ (9), ఆ వెనుకే రోసోవ్ (0) ఇలా ముగ్గురు పెవిలియన్ చేరారు. అనంతరం డివిలియర్స్ (10), డుప్లెసిస్ (1) కూడా విఫలమయ్యారు. దీంతో పది ఓవర్లు ముగిసేసరికి సఫారీలు ఐదు వికెట్లు కోల్పోయారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా డికాక్ (32) పట్టుదలతో ఆడుతున్నాడు. అతనికి వైస్ (11) చక్కని సహకారం అందిస్తున్నాడు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా జట్టు 74 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో గేల్ రెండు వికెట్లతో రాణించగా, రస్సెల్, బ్రావో చెరో వికెట్ తో రాణించారు.

More Telugu News