: ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి ఓటేసిన థర్డ్ అంపైర్...మూడు వికెట్లు కోల్పోయిన సఫారీలు

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య నాగ్ పూర్ వేదికగా మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ ఓడిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ప్రారంభించింది. మూడు ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. మొదటి ఓవర్ మూడో బంతికి ఓపెనర్ హషీమ్ ఆమ్లా (1) రన్ అవుట్ గా వెనుదిరగడంతో సఫారీల కష్టాలు మొదలయ్యాయి. రెండో ఓవర్ చివరి బంతికి డుప్లెసిస్ (9) ఆడిన షాట్ ను బెన్ డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. అయితే రీప్లేలో బంతి నేలను తాకినట్టు కనిపించింది. అయితే అది క్లియర్ గా లేకపోవడంతో థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థించాడు. దీంతో డుప్లెసిస్ పెవిలియన్ చేరాడు. అనంతరం గేల్ వేసిన మూడో ఓవర్ చివరి బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోసోవ్ (0) ను రస్సెల్ పట్టేశాడు. దీంతో మూడు ఓవర్లలో కేవలం 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. క్రీజులో డికాక్ (12), డివిలియర్స్ (2) ఉన్నారు.

More Telugu News