: నా కామెంటరీలోనే రోహిత్ అవుట్ అయ్యాడు!: షారూఖ్ ఖాన్

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కామెంటేటర్ గా మారాడు. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ షారూఖ్ ను కామెంటరీ పోస్ట్ లోపలికి ఆహ్వానించింది. దీంతో షోయబ్ అక్తర్, జహీర్ ఖాన్ తో కలిసి షారూఖ్ ఓ రెండు నిమిషాలు కామెంటరీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ సందర్బంగా ట్రాన్సిస్టర్ కాలంలో తాను కామెంటేటర్ గా ఉండాల్సిందని చెబుతూ, కాసేపు గొంతు మార్చి పాత కాలం నాటి ట్రాన్సిస్టర్ రోజులను గుర్తుచేశాడు. 'ఈ సందర్భంగా రోహిత్ శర్మ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కు యత్నించి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అలా నా తొలి కామెంటరీలోనే రోహిత్ ను అవుట్ చేశా'నని షారూఖ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే క్రికెట్ తో తనకున్న అఅనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. పాఠశాల రోజుల్లో క్రికెట్ ఆడేవాడినని తెలిపాడు. అయితే బ్యాటింగ్, బౌలింగ్ అస్సలు చేతకాదని, కేవలం కీపింగ్ మాత్రమే చేసేవాడినని అన్నాడు. అప్పట్లో మొహీందర్ అమర్ నాథ్ ఏర్పాటు చేసిన క్యాంపుకు వెళ్లానని గుర్తుచేసుకున్న షారూఖ్, తమ కోచ్ బంతిని వదిలితే నెత్తి మీద ఒక్కటిచ్చేవాడని, వాటిని భరించలేక క్రికెట్ ఆడడం మానేశానని చెప్పాడు. 2011 వరల్డ్ కప్ గెలిచినప్పుడు పండగ చేసుకున్నామని అన్నాడు. న్యూఇయర్ వేడుకలంత గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నామని షారూఖ్ తెలిపాడు. ఆ రోజు అమితాబ్, అభిషేక్ ఇలా ఎంతో మంది మనసు పులకించేలా డ్యాన్స్ చేశామని, అలా డ్యాన్స్ చేసి చాలా కాలమైందని అంటూ... 'డియర్ టీమిండియా ఆటగాళ్లు! మరోసారి డ్యాన్స్ చేయాలని ఉంది...ఇంకోసారి కప్పు గెలుచుకురండి. మమ్మల్ని ఆనందంలో ముంచెత్తండ'ని షారూక్ కోరాడు.

More Telugu News