: ఇక అఫ్రిదిపై వేటు... టీ-20 వరల్డ్ కప్ ఆఖరు!

భారత్ తో జరిగిన టీ-20 వరల్డ్ కప్ పోటీల్లో ఓటమిపాలైన పాక్ జట్టులో తొలి వేటు కెప్టెన్, సీనియర్ ఆటగాడైన షాహిద్ అఫ్రిదిపై పడనున్నట్టు తెలుస్తోంది. జట్టు నుంచి అఫ్రిదిని తొలగించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సన్నాహాలు చేస్తోందని సమాచారం. తొలి మ్యాచ్ లో గెలిచినప్పటికీ, కీలకమైన పోరులో ఓడిపోవడాన్ని ఆ దేశ క్రీడాభిమానులు ఎంతమాత్రమూ తట్టుకోలేకపోయారు. భారత్ తో జరిగిన హై ప్రొఫైల్ మ్యాచ్ ని పలు సినిమా థియేటర్లలో లైవ్ ప్రదర్శించగా, చాలా చోట్ల అభిమానులు రెచ్చిపోయి థియేటర్ల ఫర్నీచరును ధ్వంసం చేశారు. ఇక ఈ టోర్నమెంటులో జట్టు ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ, అఫ్రిది తొలగింపు ఖాయమని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఆపై జట్టులో అఫ్రిదిని కొనసాగించే అవకాశాలు కూడా లేనట్టేనని తెలుస్తోంది. అదే జరిగితే, ప్రస్తుత టీ-20 వరల్డ్ కప్ అఫ్రిదికి ఆఖరి టోర్నమెంట్ అవుతుంది.

More Telugu News