: బ్రిటిష్ సైనికుల కోసం 'మాయ' తొడుగు!

యుద్ధ రంగంలో శత్రువులను మభ్యపెట్టేందుకు గాను బ్రిటిష్ బలగాల కోసం ఒక కొత్త అత్యాధునిక తొడుగు అందుబాటులోకి రానుంది. దీని వల్ల ఎదుటి వ్యక్తి ఎదురుగానే ఉన్నప్పటికీ, శత్రువు కంటికి కనిపించకుండా 'మాయావి'లా ఎటాక్ చేయగల సౌలభ్యం ఏర్పడుతుంది. ‘వాటిక్’ అనే పేరుతో ఈ తొడుగును యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్, మసాచెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. ఈ తొడుగు ప్రత్యేకతలు ఏమిటంటే, మనిషి కళ్ల నుంచే కాకుండా ఇన్ ఫ్రారెడ్ కెమెరాల నుంచి, ఉష్ణాన్ని గుర్తించే యంత్రాల నుంచి తప్పించుకునేలా సిద్ధం చేస్తున్నారు. పరిసరాలతో కలిసిపోయేలా రూపొందిస్తున్న ఈ తొడుగులకు ఒక వైపు వెలుతురుకు స్పందించే వేల కొద్దీ సూక్ష్మమైన సున్నిత కణాలు ఉంటాయి. ఇవి పరిసరాల రంగులను గుర్తించి, వాటికి తగినట్లు స్పందించాలని పై ఉన్న కణాలకు సందేశాలు పంపించడం ద్వారా పరిసరాలకు అనుగుణంగా మారతాయి. ఈ ప్రక్రియ అంతా జరగడానికి కేవలం రెండు, మూడు సెకన్ల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా, ఈ తరహా తొడుగులను ఇప్పటికే అమెరికాలోని 3వ బెటాలియన్ సైన్యం పరీక్షిస్తోంది.

More Telugu News