: బ్యాటింగ్ ప్రారంభించిన షెహజాద్, షెర్జిల్

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. నేటి ఉదయం కోల్ కతాలో వర్షం పడడంతో పిచ్ సహకరించక మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మ్యాచ్ అరగంట ఆలస్యంగా ప్రారంభం కావడంతో భారత్, పాకిస్థాన్ జట్లకు చెందిన దిగ్గజ క్రికెటర్లు ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సత్కరించారు. అనంతరం షౌకత్ అమానత్ అలీ పాకిస్థాన్ జాతీయ గీతం ఆలపించగా, భారత జాతీయ గీతాన్ని నటదిగ్గజం అమితాబ్ బచ్చన్ ఆలపించారు. అనంతరం టాస్ గెలిచిన ధోనీ ఫీల్డింగ్ ఎంచుకుని, పాక్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దీంతో పాక్ ఆటగాళ్లు షెహజాద్ (3), షెర్జిల్ (8) ఇన్నింగ్స్ ఆరంభించారు. తొలి స్పెల్ ను ధోనీ విభిన్నంగా ప్రారంభించాడు. తొలి ఓవర్ ను నెహ్రా వేయగా, రెండో ఓవర్ ను అశ్విన్ వేయడం విశేషం. మూడు ఓవర్లు ముగిసేసరికి పాక్ జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 12 పరుగులు చేసింది.

More Telugu News