: బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త... సేవింగ్స్ పై ఇక మూడు నెలలకోసారి వడ్డీ

వివిధ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలను నిర్వహిస్తున్న వారందరికీ శుభవార్త. ఇకపై ప్రతి మూడు నెలలకు లేదా మరింత తక్కువ కాలానికి వడ్డీలను చెల్లించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సేవింగ్స్ ఖాతాలపై రోజువారీ వడ్డీని లెక్కించి, ప్రతి ఆరు నెలలకూ ఓసారి చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ బ్యాంకులు 4 శాతం, ప్రైవేటు బ్యాంకులు 6 శాతం వరకూ వడ్డీని ఇస్తున్నాయి. తమ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు నిర్వహిస్తున్న కోట్లాది మంది ప్రజలకు లాభం కలుగుతుందని భావిస్తున్నట్టు ఆర్బీఐ పేర్కొంది.

More Telugu News