: వీడియో గేములు ఆడే చిన్నారుల్లో రెట్టింపు మేధస్సు: బ్రిటన్ అధ్యయనం

"ఈ మధ్య కొత్త స్మార్ట్ ఫోన్ కొన్నా. మావాడు దాంతో ఎంత బాగా ఆటలాడుతున్నాడో... నాక్కూడా వాడిలా ఆడటం రాలేదు" అని చెప్పుకుని మురిసిపోయే వారెందరో ఈవేళ మనకు తారసపడుతుంటారు. మరోవైపు చిన్నారులను వీడియో గేమ్స్ కు అలవాటు కానీయవద్దని చెప్పే వారూ తగులుతారు. ఈ నేపథ్యంలో పిల్లలు వీడియో గేమ్స్ ఆడటం మంచిదా? కాదా? అన్న విషయంలో కొలంబియా యూనివర్శిటీలో భాగమైన మాలినన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చర్లు ఓ పెద్ద అధ్యయనాన్నే చేశారు. వారి అధ్యయనం వెల్లడించిన ఫలితాల ప్రకారం, వీడియోగేమ్స్ ఆడని వారితో పోలిస్తే, ఆడే పిల్లల్లో 1.75 రెట్లు మేధో శక్తి అధికంగా ఉందట. వీరు చదువులో 1.88 రెట్లు ప్రతిభను ప్రదర్శిస్తున్నారని, వీరిలో కమ్యూనికేషన్స్ స్కిల్స్, రిలేషన్స్ బాగున్నాయని స్టడీ నిర్వహించిన ప్రొఫెసర్ కేథరిన్ ఎం కీయెస్ వెల్లడించారు. అధికంగా ఆటలాడటం వల్ల పిల్లల నైపుణ్యం చెడుతోందన్న ఆందోళనలను పటాపంచలు చేస్తూ, అందుకు విరుద్ధమైన ఫలితాలు తమకు సాక్ష్యాలతో సహా లభించాయని, అయితే అదే పనిగా స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోరాదని ఆమె సలహా ఇచ్చారు. తమ అధ్యయనంలో భాగంగా వివిధ దేశాలకు చెందిన 6 నుంచి 11 ఏళ్ల పిల్లలను పరిశీలించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి, సమగ్ర విశ్లేషణ జరిపినట్టు తెలిపారు.

More Telugu News