: ఎస్బీఐ సిగలో మరో ఘనత!... మయన్మార్ లో పూర్తి స్థాయి బ్యాంకింగ్ కు అర్హత

భారత్ లో ప్రభుత్వ బ్యాంకుల్లో రారాజుగా వెలుగొందుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)... ఎన్ని ప్రైవేట్ బ్యాంకులు రంగప్రవేశం చేస్తున్నా, తనదైన శైలిలో దూసుకెళుతోంది. ప్రైవేట్ బ్యాంకులకు దీటుగా రాణిస్తూ భారీగా లాభాలను గడిస్తోంది. సుదీర్ఘ బ్యాంకింగ్ ప్రస్థానంలో లెక్కలేనన్ని రికార్డులను నమోదు చేసిన ఎస్బీఐ... తాజాగా మరో ఘనతను సాధించింది. ఆసియా దేశం మయన్మార్ లో పూర్తి స్థాయిలో సొంతంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగించేందుకు అనుమతి సాధించింది. మొత్తం నాలుగు విదేశీ బ్యాంకులకు మయన్మార్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయగా, వాటిలో ఎస్బీఐ కూడా ఒకటి. త్వరలోనే వంద శాతం సొంత నిధులతో మయన్మార్ లో ఎస్బీఐ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రారంభించనుంది.

More Telugu News