: 9న సంపూర్ణ సూర్యగ్రహణం!

ఈ నెల 9వ తేదీన సంభవించనున్న సంపూర్ణ సూర్యగ్రహణాన్ని తెలుగు నేలపై నుంచి పాక్షికంగా వీక్షించవచ్చు. ఈ మేరకు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పశ్చిమ, వాయవ్య రాష్ట్రాల్లో మినహా భారత్ లోని అన్ని రాష్ట్రాల్లో సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చని తెలిపింది. తెల్లవారుజామున 4 గంటల 49 నిమిషాలకు ప్రారంభమయ్యే సూర్యగ్రహణం ఉదయం 10 గంటల 5 నిమిషాలకు పూర్తవుతుంది. సుమారు మూడు గంటలకు పైబడి సూర్యుడు కనపడడు. అయితే, స్థానిక కాలమానం ప్రకారం ఈ వ్యవధి ఒక్కో ప్రాంతాన్ని అనుసరించి మారుతుంది. హైదరాబాద్ లో ఉదయం 6.29 గంటల నుంచి 6.47 గంటల వరకు... సుమారు 18 నిమిషాల పాటు, నల్గొండ జిల్లాలో 6.26 గంటల నుంచి 6.47 గంటల వరకు, అంటే 21 నిమిషాల పాటు సూర్యగ్రహణాన్ని చూడవచ్చు. కాకపోతే అందుకు తగిన జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలి. భారత్ తో పాటు ఆగ్నేయాసియా దేశాలలోనే కాక ఆస్ట్రేలియా, ఉత్తరపసిఫిక్ సముద్ర ప్రాంతంలో గ్రహణం ఏర్పడుతుందని ఆ ప్రకటనలో పేర్కొంది.

More Telugu News