: ఫేస్ బుక్ కు షాక్!...రూ.74 లక్షల జరిమానా విధించిన జర్మనీ కోర్టు

సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న భారత్ లో నెట్ వినియోగంపై గుత్తాధిపత్యం సాధించేందుకు ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ ప్రతిపాదించిన ‘ఫ్రీ బేసిక్స్’కు ట్రాయ్ రెడ్ సిగ్నల్ వేసింది. తాజాగా తన వినియోగదారుల డేటాను ఏ విధంగా వినియోగించుకుంటున్న విషయాన్ని వెల్లడించేందుకు ససేమిరా అన్న ఆ సంస్థకు జర్మనీ కోర్టు భారీ జరిమానాను విధించింది. ఫేస్ బుక్ లో యూజర్లు పోస్టు చేస్తున్న మేధో సంపత్తి అంశాలను ఎలా వినియోగించుకుంటున్నారో తెలపాలని ఆ సంస్థకు జర్మనీ రాజధాని బెర్లిన్ లోని రీజనల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ వివరాలు వెల్లడించలేమని ఫేస్ బుక్ నిరాకరించింది. దీంతో కోర్టు ఫేస్ బుక్ కు 1.09 లక్షల డాలర్లు (రూ.74 లక్షలు) జరిమానా విధించింది.

More Telugu News