: మీరు ఒక్క ఖాతా తొలగిస్తే మేం పది సృష్టిస్తాం... ఫేస్ బుక్, ట్విట్టర్ సీఈవోలకు ఐఎస్ హెచ్చరికలు

ఇప్పటివరకు పలువురు దేశాధినేతలకు హెచ్చరికలు జారీ చేసిన ఐఎస్ఐఎస్, తాజాగా ఫేస్ బుక్, ట్విట్టర్ సీఈవోలు జుకర్ బర్గ్, జాక్ డోర్సేలను బెదిరించింది. త్వరలోనే వీరిని హతమారుస్తామంటూ ఓ వీడియో విడుదల చేసింది. ఈ మధ్య పలు అనుమానిత ఉగ్రవాద ఖాతాలను ఈ రెండు సోషల్ మీడియా వెబ్ సైట్లు తొలగించిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతిగా స్పందించిన ఐఎస్ 'సన్స్ ఆఫ్ కాలిపత్ ఆర్మీ' పేరుతో హెచ్చరిక వీడియో విడుదల చేసింది. ఇప్పటివరకు తాము 10వేల ఫేస్ బుక్ అకౌంట్లను, 150 ఫేస్ బుక్ గ్రూప్ లను, 5వేల ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేశామని ఐఎస్ వెల్లడించింది. ఇకనైనా ఫేస్ బుక్, ట్విట్టర్ సైట్లు వారి చర్యలను ఆపకుంటే హ్యాక్ చేసిన ఖాతాలను తన మద్దతుదారులకు కేటాయిస్తామని తెలిపింది. ఇంతవరకు తాము మిమ్మల్ని లక్ష్యంగా చేసుకోలేదని, కానీ ఇకపై ఒక్క ఖాతా తొలగించినా తాము పది సృష్టిస్తామని స్పష్టం చేసింది. త్వరలోనే జుకర్, జాక్ పేర్లను చెరిపేస్తామంటూ వారి ఫోటోలను చూపుతూ వాటికి బుల్లెట్లతో రంధ్రాలు పెడుతున్నట్టు వీడియోలో చూపింది.

More Telugu News