: రూ. 29 వేలు దాటిన బంగారం ధర

వివాహాది శుభకార్యాల వేళ బంగారానికి మరోసారి డిమాండ్ పెరిగింది. జ్యూయలరీ రంగంలో వ్యాపారం జోరుగా సాగుతుండటంతో, ఆభరణాల కొనుగోలుదారుల నుంచి వచ్చిన మద్దతుతో బంగారం ధర మరోసారి రూ. 29 వేల మార్క్ ను అధిగమించింది. బుధవారం నాటి బులియన్ మార్కెట్ సెషన్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 190 పెరిగి రూ. 29,100కు చేరింది. ఇదే సమయంలో వెండి ధర మాత్రం కిలోకు రూ. 150 తగ్గి, రూ. 37,100కు పడిపోయింది. మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 1,229.11 డాలర్లుగా నమోదైంది. ఇదిలావుండగా, ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు మరింత దూసుకెళ్లాయి. ఏప్రిల్ 5న డెలివరీ అయ్యే కాంట్రాక్టులో బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.78 శాతం పెరిగి రూ. 29,531కి పెరిగింది. వెండి ధర అర శాతం పెరిగి రూ. 37,369 (మార్చి 4 డెలివరీ)కి చేరుకుంది.

More Telugu News