: అబ్రకదబ్ర పదానికి అసలు అర్థమే లేదు!: ఇంద్రజాలికుడు సామల వేణు

వరల్డ్ మెజిషియన్స్ డే ను పురస్కరించుకుని ప్రముఖ ఇంద్రజాలికుడు సామల వేణు ఒక టీవీ చానెల్ లైవ్ ప్రోగ్రాం లో పాల్గొని ప్రేక్షకులను మాయచేశాడు. ఇంద్రజాల విద్య భారత దేశంలోనే ఆవిష్కృతమైందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పురాణ కాలంలోనే మన ముందు తరాలు ఇంద్రజాలంలో నిష్ణాతులని ఆయన చెప్పారు. అయితే ఇంద్రజాలంలో మాయలు, మంత్రాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. చిన్నప్పటి నుంచి మన మెదళ్లలో అబ్రకదబ్ర అంటే మంత్రం అని బలంగా నాటుకుపోయిందని, నిజానికి అబ్రకదబ్రలో ఎలాంటి అర్థం లేదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రదర్శించిన ఆయన, ఇంద్రజాలికులు మాస్ ను ఎలా వశం చేసుకుంటారో ఆయన వివరించారు. మనుషుల మెదళ్లను స్వాధీనంలోకి తెచ్చుకోగలిగితే ఇంద్రజాలికుడు సగం విజయం సాధించినట్టేనని ఆయన పేర్కొన్నారు.

More Telugu News