: కాలుష్యంలో చైనాను దాటిన ఇండియా!: గ్రీన్ పీస్ ఇండియా

మిగతా విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ చైనా, భారత్ దేశాలు రెండూ కాలుష్యం విషయంలో మాత్రం తెగ పోటీపడుతున్నాయి. రెండు దేశాల్లోను వాతావరణ కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉత్పత్తవుతోంది. ఈ రెండు దేశాలు కాలుష్యంలో నువ్వా? నేనా? అన్నట్టుగా పోటీ పడుతున్నాయని గ్రీన్ పీస్ ఇండియా తెలిపింది. అమెరికా నాసాకు చెందిన ఉపగ్రహం అందించిన సమాచారం ప్రకారం, భారత్ లో కాలుష్యం ఇంకా ఎక్కువగా పెరిగిపోతోంది. యావరేజ్ పర్టిక్యులేట్ మాటర్ స్థాయి చైనాలో కంటే భారత్ లో ఎక్కువగా నమోదైందని తెలిపింది. గత దశాబ్ద కాలంలో చైనా కంటే భారత్ లో ఎక్కువ కాలుష్యం నమోదవ్వడం ఇదే ప్రథమమని గ్రీన్ పీస్ ఇండియా చెప్పింది. కాలుష్య నివారణకు చైనా ప్రభుత్వం ఏటికేడు చర్యలు తీసుకుంటోందని, భారత్ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని సదరు సంస్థ పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన అత్యంత కాలుష్య పూరిత 20 నగరాల్లో 13 నగరాలు భారత్ లోనే ఉన్నాయని గ్రీన్ పీస్ సంస్థ వెల్లడించింది.

More Telugu News