: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన డ్రెస్ లభ్యం!

ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన డ్రెస్ ను పరిశోధకులు గుర్తించారు. 'తర్కాన్ డ్రెస్' గా పిలుస్తున్న దీనిని ఈజిప్షియన్ టూంబ్ లో గుర్తించారు. అనంతరం దీనిని 1990లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ లో ఉన్న ఈజిప్షియన్ ఆర్కియాలజీ పీటర్ మ్యూజియంకి తరలించారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ కు చెందిన పరిశోధకులు కార్బన్ డేటింగ్ పద్ధతుల్లో పరీక్షలు నిర్వహించి ఈ వస్త్రం 5,100 నుంచి 5,500 సంవత్సరాల క్రితందని తేల్చారు. దీంతో ఇప్పటి వరకు లభ్యమైన వస్త్రాల్లో 'తర్కాన్ డ్రెస్' అత్యంత పురాతనమైన చేనేత వస్త్రంగా నిలిచింది. దీని నెక్ 'వీ' ఆకారంలో ఉందని, స్లీవ్ దగ్గర మడతలు ఉన్నాయని వారు వెల్లడించారు. ఈజిప్టులోని సంపన్న వర్గాల స్త్రీలకు వస్త్రాలు నేసేందుకు ప్రత్యేకంగా పని వారు ఉండేవారనే విషయం దీంతో అర్థమవుతుందని వారు పేర్కొన్నారు.

More Telugu News