: వ్యాయామంతో కేన్సర్ ని అరికట్టవచ్చు!

కఠిన వ్యాయామం ద్వారా కేన్సర్ వ్యాధిని కొంతమేరకు అరికట్టవచ్చు. ఈ విషయాన్ని కోపెన్ హాగన్ యూనివర్శిటీ పరిశోధకుడు పెర్నిల్లే హాజ్ మన్ లండన్ లో వెల్లడించారు. ఎలుకలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం బయటపడినట్లు చెప్పారు. వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరంలోని అడ్రినలిన్ హార్మోన్ ప్రవాహ వేగం పెరుగుతుందని, ఇది కేన్సర్ కణితి వ్యాప్తిని నిరోధిస్తుందని, ఈ విషయం ప్రయోగాత్మకంగా నిరూపితమైందన్నారు. అయితే, సాధారణ వ్యాయామం కంటే కఠినతరమైన ఎక్సైర్ సైజుల ద్వారా ప్రాణాంతక వ్యాధి అయిన కేన్సర్ ను అరికట్టవచ్చని హాజ్ మన్ పేర్కొన్నారు.

More Telugu News