: లాభం... నష్టం... లాభం... నష్టం! ఊగిసలాట మధ్య స్టాక్ మార్కెట్

సెషన్ ఆరంభంలో లాభం.. ఆపై నిమిషాలకే నష్టాల్లోకి.. తిరిగి 11:30 గంటలకు లాభాలు, మళ్లీ నిమిషాల్లోనే నష్టం, తిరిగి రెండు గంటల తరువాత లాభాల్లోకి... ఇలా సాగిన భారత స్టాక్ మార్కెట్ సెషన్ ముగిసేసరికి మాత్రం లాభాల్లో నిలిచింది. మధ్యాహ్నం తరువాత యూరప్ మార్కెట్ల సానుకూల ధోరణి భారత ఇన్వెస్టర్లపై ప్రభావం చూపిందని, ఇదే సమయంలో ఎఫ్ఐఐల నుంచి వచ్చిన కొనుగోలు మద్దతు కూడా మార్కెట్ లాభాలను నిలిపిందని నిపుణులు వ్యాఖ్యానించారు. బుధవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 189.90 పాయింట్లు పెరిగి 0.82 శాతం లాభంతో 23,381.87 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 60.20 పాయింట్లు పడిపోయి 0.85 శాతం నష్టంతో 7,108.45 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.47 శాతం, స్మాల్ క్యాప్ 0.21 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 35 కంపెనీలు లాభాల్లో నడిచాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, వీఈడీఎల్, బీపీసీఎల్ తదితర కంపెనీలు లాభపడగా, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, కోల్ ఇండియా, లుపిన్, సిప్లా తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,694 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,107 కంపెనీలు లాభాల్లోను, 1,441 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. మంగళవారం నాటి సెషన్ ముగింపు సమయంలో రూ. 87,01,285 కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్ నేడు రూ. 87,57,497 కోట్లకు పెరిగింది.

More Telugu News