: చివరి రెండు గంటల్లో అమ్మకాల వెల్లువ!

భారీ నష్టం తరువాత భారత స్టాక్ మార్కెట్ లాభాల్లోకి వెళ్లిందన్న ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైంది. క్రితం సెషన్లో 500 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్ నేడు 350 పాయింట్లుకు పైగా నష్టపోయింది. ముఖ్యంగా యూరప్ మార్కెట్లు ప్రారంభమైన తరువాత ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించగా, చివరి రెండు గంటల వ్యవధిలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 362.15 పాయింట్లు పడిపోయి 1.54 శాతం నష్టంతో 23,191.97 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 114.70 పాయింట్లు పడిపోయి 1.60 శాతం నష్టంతో 7,048.25 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 2.43 శాతం, స్మాల్ క్యాప్ 2.25 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 9 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ తదితర కంపెనీలు లాభపడగా, ఎస్బీఐ, జడ్ఈఈఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్బీ, వీఈడీఎల్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,725 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 615 కంపెనీలు లాభాల్లోను, 2,005 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. శుక్రవారం నాటి సెషన్ ముగింపు సమయంలో రూ. 88,63,667 కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్ నేడు రూ. 87,01,285 కోట్లకు పెరిగింది.

More Telugu News