: లక్షల ఏళ్ల నాటి ఏనుగు దంతం లభ్యం

లక్షల ఏళ్ల నాటి ఏనుగు దంతం పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో లభ్యమైంది. పంజాబ్ యూనివర్సిటీ జువాలజీ విభాగానికి చెందిన పరిశోధకుల బృందం గుజరాత్-ఖరియన్ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టింది. ఈ తవ్వకాల్లో ఎనిమిది అంగుళాల వ్యాసం కలిగిన 1.1 మిలియన్ ఏళ్ల నాటి ఏనుగు దంతాన్ని కనుగొన్నారు. ఇది స్టెగొడన్ జాతికి చెందిన ఏనుగు దంతమని వారు పేర్కొన్నారు. పాకిస్థాన్ లో ఇప్పటి వరకు లభ్యమైన ఏనుగు దంతాల్లో ఇదే అతి పెద్దదని, అత్యంత పురాతనమైనదని వారు వెల్లడించారు.

More Telugu News