: వృద్ధాప్యపు సమస్యల్ని అనుభవంలోకి తెచ్చే థర్డ్ ఏజ్ సూట్

వృద్ధాప్యంలో సమస్యలు పట్టిపీడిస్తాయి. వీరి బాధలు ఇతరులకు అర్థం కావు. అందుకే, అవి ఎలా ఉంటాయో తెలియజేసే ఉద్దేశంతో 'ఫోర్డ్' సంస్థ 'థర్డ్ ఏజ్' పేరిట సరికొత్త సూట్ ను తయారు చేసింది. గ్లూకోమాతో బాధపడేవారిలా కనిపించే గాగుల్స్, చెవులు అంతంతమాత్రంగా వినిపించేలా హెడ్ ఫోన్స్, మెడ సరిగ్గా తిరగకుండా ఉండేందుకు నెక్ బ్యాండ్, స్టిమ్యులేట్ చేసేందుకు గ్లోవ్స్, కాళ్ల పిక్కలను పట్టి ఉంచే పట్టీలు ఈ సూట్ లో ఉంటాయి. ఈ సూట్ ధరించిన వారు వృద్ధాప్యం అనుభవాన్ని పొందుతారని ఫోర్డ్ సంస్థ తెలిపింది. యువకులు వృద్ధాప్యాన్ని అనుభవించేందుకు ఈ సూట్ ను తయారు చేయలేదని, కేవలం వృద్ధాప్యపు సమస్యలను అనుభవపూర్వకంగా తెలుసుకుంటే వారికి మెరుగైన సౌకర్యాలు అందించే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే దానిని తయారు చేశామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సూట్ ను ఓ మీడియా సంస్థ ప్రతినిధికి తొడిగి, ప్రయోగాత్మకంగా నడపగా, వృద్ధాప్యాన్ని అనుభవించినట్టు ఉందని ఆయన తెలపడం విశేషం.

More Telugu News