: ఇండియాలో 'ఫ్రీ బేసిక్స్'ని ఆపేసిన ఫేస్ బుక్!

వివాదాస్పద ఫ్రీ బేసిక్స్ ప్రాజెక్టును ఇండియాలో నిలిపివేస్తున్నట్టు ఫేస్ బుక్ ప్రకటించింది. ఉచితంగా ఇంటర్నెట్ ను అందించరాదని టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం మేరకు తాము ఈ చర్య చేపట్టినట్టు సంస్థ ప్రతినిధి ఒకరు వివరించారు. అంతకుముందు నెట్ న్యూట్రాలిటీ పేరిట పెద్ద చర్చే జరుగగా, ఫ్రీ బేసిక్స్ కూడదంటూ అత్యధికులు చేసిన వినతులకు అనుగుణంగా ట్రాయ్ నిర్ణయం వెలువడిన సంగతి తెలిసిందే. స్పెక్ట్రమ్ ను పొందిన సమయంలో టెల్కోలు అంగీకరించిన నిబంధనల్లో ఏ ఒక్కదాన్ని అమలు చేయకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ట్రాయ్ చైర్మన్ రామ్ సేవక్ శర్మ, నిబంధనలు మీరితే రోజుకు రూ. 50 వేలను జరిమానాగా విధిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఫ్రీ బేసిక్స్ ను ఫేస్ బుక్ నిలిపివేసింది.

More Telugu News