: గంటల వ్యవధిలో రూ. 700కు పైగా పెరిగిన గోల్డ్ రేట్!

ఒక్క రోజులో బంగారం ధర కొండెక్కేసింది. ఏడాది కాలంలో ఎన్నడూ లేనంత పెరుగుదలను నేటి బులియన్ మార్కెట్లో గోల్డ్ నమోదు చేసింది. క్రితం ముగింపుతో పోలిస్తే, రూ. 710 పెరిగి రూ. 28 వేలను దాటింది. మరోవైపు వెండి ధర కిలోకు రూ. 37,120 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ మార్కెట్ కు పెట్టుబడులు వెల్లువెత్తుతుండటం, రూపాయి మరింతగా బలహీనపడటం వంటి కారణాలతోనే బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో బంగారం ధర పది గ్రాములకు రూ. 50 వేలను చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిన్న నిపుణులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

More Telugu News