: మోదీ సర్కారు బాదుడు... ప్రాణాలు నిలిపే ఔషధాలు మరింత కాస్ట్ లీ గురూ!

ప్రాణాంతక వ్యాధుల నుంచి ఉపశమనం దిశగా ఇండియాలోకి దిగుమతి అయ్యే మందుల ఖరీదు మరింతగా పెరగనుంది. ముఖ్యంగా వివిధ రకాల క్యాన్సర్లు, హెచ్ఐవీ, హిమోఫీలియా, మధుమేహం, ఇన్ఫెక్షన్లు తదితరాలకు వాడే ఔషధాల ఖరీదు 10 నుంచి 25 శాతం పెరగనుంది. మోదీ సర్కారు ఈ ఔషధాలపై ఎక్సైజ్ సుంకాలను విధించడమే ఇందుకు కారణం. ఔషధాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నా, ఇండియాలోనే తయారైనా వీటిని కొనుగోలు చేయాలంటే అధికంగా చెల్లించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతోంది. వైద్య రంగాన్ని పేదలకు మరింతగా అందుబాటులోకి తీసుకురావాలన్న మోదీ లక్ష్యానికి ఈ నిర్ణయాలు వ్యతిరేకమని నిపుణులు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా బడ్జెట్ ముందు ఎన్ఎల్ఈఎం (నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ - అత్యవసర ఔషధాల జాతీయ జాబితా) ఔషధాలపైనా కనికరం చూపలేదని వెల్లడించారు. కాగా, 76 ముఖ్య ఔషధాలపై సుంకాలను పెంచుతూ జనవరి 28న నోటిఫికేషన్ విడుదల కాగా, వాటిల్లో 47 ఔషధాలు ఎన్ఎల్ఈఎం జాబితాలో ఉండటం గమనార్హం.

More Telugu News