: ‘ముద్రా’ చైర్మన్ ఏజీ కృష్ణమూర్తి కన్నుమూత

అడ్వర్టయిజింగ్ రంగంలో పేరెన్నికగన్న ‘ముద్రా యాడ్స్’ వ్యవస్థాపక చైర్మన్ అచ్యుతని గోపాల కృష్ణమూర్తి (ఏజీ కృష్ణమూర్తి) ఇక లేరు. 1942 ఏప్రిల్ 8న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించిన ఏజీ, విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసుకున్న అనంతరం నేరుగా ముంబై రైలెక్కేశారు. క్వాలికో టెక్స్ టైల్స్ మిల్లులో చిరుద్యోగిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఏజీకే... ఆ తర్వాత ధీరూభాయి అంబానీ నెలకొల్పిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లో చేరారు. తదనంతరం శిల్పి యాడ్స్ లో మేనేజర్ గా చేరిన ఆయన 1980లో ముద్రా కమ్యూనికేషన్స్ అండ్ అడ్వర్టయిజింగ్ (ముద్రా యాడ్స్)’ను ప్రారంభించారు. రియలన్స్ ఉత్పత్తి ‘విమల్’తో పాటు రస్నా తదితర ప్రఖ్యాత బ్రాండ్లకు యాడ్స్ చేసిపెట్టిన ఏజీకే... భారత ప్రకటనల రంగంలో పేరు ప్రఖ్యాతులు సాధించారు. రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయి అంబానీకి అత్యంత సన్నిహితంగా మెలగిన ఏజీకే... రిలయన్స్ చైర్మన్ పై పలు పుస్తకాలు రచించారు. ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలోనూ ఏజీకే పలు వ్యాసాలు రాశారు. చరమాంకంలో హైదరాబాదులో స్థిరపడ్డ ఆయన కొద్దిసేపటి క్రితం తన సొంతింటిలోనే తుది శ్వాస విడిచారు.

More Telugu News