: పరపతి సమీక్షలో ఎటూ తేల్చని ఆర్బీఐ గవర్నర్

ఈ ఉదయం పరపతి సమీక్ష నిర్వహించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ కీలకమైన రెపో రేటును యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించారు. వడ్డీ రేట్లను తగ్గించే లేదా పెంచే పరిస్థితులు ఇప్పటికిప్పుడు లేవని అభిప్రాయపడ్డ రాజన్ పరపతి సమీక్ష తరువాత ఎటువంటి మార్పులనూ ప్రకటించడం లేదని తెలిపారు. మార్చి 2017 నాటికి టోకు ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణం 5 శాతం వద్ద కొనసాగుతుందని భావిస్తున్నామని అంచనా వేశారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి పరపతి సమీక్ష. ప్రస్తుతం రెపో రేటు 6.75 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 5.75 శాతం వద్ద, నగదు నిల్వల నిష్పత్తి 4 శాతం వద్ద కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక వృద్ధికి విఘాతం కలుగకుండా చూడాలన్నదే తమ అభిమతమని ఈ సందర్భంగా రాజన్ వ్యాఖ్యానించారు. గడచిన ఏడాది కాలంలో 1.25 శాతం మేరకు వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ, ఆ ప్రయోజనాలు ఖాతాదారులకు, రుణగ్రహీతలకు అందలేదని గుర్తు చేసిన ఆయన, బ్యాంకులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.

More Telugu News