: బుల్ దూకింది...లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

జనవరి చివరి వారంలో ఆఖరి రోజు బుల్ పరుగులు పెట్టింది. నేటి స్టాక్ మార్కెట్ ఆరంభంలో మందకొడిగా ప్రారంభమైనప్పటికీ చివరికి వచ్చేసరికి భారీ లాభాలతో ముగిసింది. నేటి మార్కెట్ లో సెన్సెక్స్ 401 పాయింట్లు లాభపడి 24,871 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 138 పాయింట్లు లాభపడి 7,564 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో డాలర్ తో రూపాయి మారకం విలువ కిందికి వచ్చింది. డాలర్ మారకం విలువ 67.89 రూపాయల వద్ద కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ లో యస్ బ్యాంక్ షేర్లు 11.53 శాతం లాభపడి 749 రూపాయల వద్ద ముగిసింది. వీటితోపాటు వేదాంత, సన్ ఫార్మా, హీరో మోటా కార్ప్, కోల్ ఇండియా షేర్లు లాభాల పంట పండించాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు 4.19 రూపాయలు నష్టపోయి 124.70 రూపాయల వద్ద ముగిశాయి. దానితో పాటు ఎస్బీఐ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల బాటలో నడిచాయి.

More Telugu News