: ఎంత తిన్నా లావెక్కని జబ్బు 'లైపోడిస్ట్రోఫీ'

ఆరోగ్యం, ఫిట్ నెస్ పై శ్రద్ధ పెరగడంతో చాలా మంది క్యాలరీలు లెక్కపెట్టుకుని మరీ భోజనం చేస్తున్నారు. లావవ్వడం వల్ల చాలా ఇబ్బందులున్నాయనే భయంతో ఇష్టమైన పదార్థాలు లాగించేందుకు కూడా చాలా మంది యువత వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంత తిన్నా లావెక్కని జబ్బు ఒకటి ఉందని వైద్యులు చెబుతున్నారు. 'లైపోడిస్ట్రోఫీ' అనే జబ్బున్నవారు ఎంత తిన్నా లావెక్కే ప్రశ్నేలేదని వైద్యులు చెబుతున్నారు. ఈ జబ్బు ఉన్నవారు సన్నగా ఉండడం తప్ప ఇతర ఇబ్బందులు తలెత్తవని వైద్యులు తెలిపారు. సాధారణ స్థాయిలో విడుదల కావాల్సిన ఇన్సులిన్ కంటే వీరి శరీరంలో ఆరురెట్లు ఎక్కువగా విడుదల అవుతుందని వారు వెల్లడించారు. దీంతో వీరు ఎంత కొవ్వున్న పదార్థాలు తిన్నా అవి కరిగిపోతాయని, వారికి కనీసం షుగర్ వ్యాధి కూడా వచ్చే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు. సన్నబడడం మినహా ఇతర ఇబ్బందులు తలెత్వు కాబట్టి, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు వెల్లడించారు.

More Telugu News