: తగ్గిన బంగారం, పెరిగిన క్రూడాయిల్ ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గగా, ముడిచమురు ధరలు పెరిగాయి. క్రూడాయిల్ కొనుగోళ్లకు ట్రేడర్లు ఆసక్తి చూపడంతో బ్యారల్ క్రూడాయిల్ ధర 30 డాలర్లను దాటింది. భారత బాస్కెట్ ధర రూ. 103 పెరిగి రూ. 2,158కి చేరింది. ఇదే సమయంలో బంగారం ధర రూ. 30 తగ్గి రూ. 26,160కి చేరింది. వెండి ధర కిలోకు రూ. 97 తగ్గి 34,277 వద్ద కొనసాగుతోంది. ఒపెక్ నుంచి ఉత్పత్తి తగ్గవచ్చన్న సంకేతాలతో బులియన్ మార్కెట్ పెట్టుబడులు చమురు మార్కెట్ వైపునకు మరలడమే ధరలపై ప్రభావం చూపిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ముడిచమురు ధరలు ఏకంగా 13.5 శాతం పెరిగి పన్నెండేళ్ల కనిష్ఠస్థాయి నుంచి వెనక్కు మళ్లాయి. కాగా, ముడి చమురు ధరల పతనం ఆగినట్టుగా భావించలేమని, మార్కెట్ బేర్ ఓ తాత్కలిక విశ్రాంతిని మాత్రమే తీసుకుందని నిపుణులు అభిప్రాపడ్డారు.

More Telugu News