: ప్రతి ఒక్కరికీ 10 రెట్లు అధిక జ్ఞాపక శక్తి... వాడుకోవట్లేదంతే!

మానవ మెదడు ఊహించిన దానికంటే 10 రెట్లు అధిక జ్ఞాపక శక్తిని కలిగివుంటుందని, అయితే దాన్నెవరూ వాడుకోవడం లేదని ఓ సరికొత్త రీసెర్చ్ సంచలన విషయాన్ని వెల్లడించింది. "న్యూరోసైన్స్ విభాగంలో వెల్లడైన ఈ విషయం నిజంగా సంచలనమే" అని కాలిఫోర్నియాలోని సాల్క్ ఇనిస్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ స్టడీస్ ప్రొఫెసర్, పరిశోధకుడు టెర్రీ సెజ్ నోవిస్కీ వెల్లడించారు. తమ తాజా పరిశీలన ద్వారా మెదడులో గుర్తింపు సామర్థ్యాన్ని 10 రెట్ల వరకూ పెంచవచ్చని ఆయన తెలిపారు. 'ఈ-లైఫ్' జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం వివరాల ప్రకారం, మెదడులో హిపోకామ్పల్ (బ్రెయిన్ మెమోరీ సెంటర్) న్యూరాన్లను జాగృతం చేస్తే, మెదడుగు గుణాత్మక శక్తి మరింతగా పెరుగుతుందని తమ రీసెర్చ్ లో వెల్లడైనట్టు టెర్రీ వెల్లడించారు. మెదడులోని ఎలక్ట్రికల్, కెమికల్ చర్యల కారణంగానే ఆలోచనలు, గుర్తింపు సామర్థ్యం మారుతోందని ఆయన అన్నారు.

More Telugu News