: అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లపై పరిశోధనలు ఆపేయడమే మంచిదేమో!: కెనడా శాస్త్రవేత్తలు

అంగారకుడిపై జీవం ఆనవాళ్లు లభించే అవకాశం ఉందంటూ చేస్తున్న ప్రయత్నాలు ఆపేయడమే మంచిదేమోనని కెనడాకు చెందిన పరిశోధకుల బృందం అభిప్రాయపడింది. అంగారకుడిపై ఉండే పరిస్థితులకు దగ్గరగా ఉండే అంటార్కిటికాలో అతి శీతల ప్రాంతమైన 'యూనివర్సిటీ వ్యాలీ' ప్రాంతంలో నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్న మెక్ గిల్ యూనివర్సిటీ బృందం ఇక్కడ ఎలాంటి సూక్ష్మజీవుల ఆనవాళ్లు దొరకలేదని తెలిపింది. అరుణగ్రహంపై జీవం ఆనవాళ్లపై పరిశోధనలు చేస్తున్నవారికి ఈ పరిశోధనల ఫలితాలు నిరాశను కలిగించేవేనని ఆ బృందం వెల్లడించింది. అయితే అక్కడ జీవయోగ్యమైన వాతావరణం లేదన్న విషయం తెలుసుకోవడం కూడా ప్రధానమేనని ఆ బృందం పేర్కొంది. భూమిపై జీవించే జీవుల నివాసానికి యోగ్యమైన కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్ వంటి వాయువులు యూనివర్సిటీ వ్యాలీలో లభ్యం కాలేదని వారు స్పష్టం చేశారు. దీంతో అరుణగ్రహంపై కూడా జీవయోగ్యమైన వాతావరణం ఉండే అవకాశం లేదని వారు తెలిపారు.

More Telugu News