: అంతరిక్షంలో అద్భుతం... ఒకే వరుసలోకి వచ్చిన ఐదు గ్రహాలు

అంతరిక్షంలో అపురూపమైన దృశ్యం చోటుచేసుకుంది. సౌరకుటుంబంలోని బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శని, గురుగ్రహాలు ఒకేసారి ఒకే వరుసలోకి వచ్చి కనువిందు చేస్తున్నాయి. సుమారు 11 సంవత్సరాల తరువాత ఒకే వరుసలోకి వచ్చిన ఈ గ్రహ కూటమిని నెల రోజుల పాటు చూడవచ్చు. ఇటువంటి రోదసీ అద్భుతం చివరిసారిగా 2004 డిసెంబర్ నుంచి 2005 జనవరి వరకు కనిపించింది. అంటే ఇప్పటికి పదేళ్లు దాటింది. ఈ రోదసీ అద్భుతం ఉత్తర ధృవప్రాంతంలో మాత్రమే బాగా కనిపిస్తుంది. అక్కడ ఏ పరికరాలు లేకుండా దీనిని చూడవచ్చు. అయితే రోజూ కనిపించే నక్షత్రాల నుంచి వాటిని వేరుగా గుర్తించడం కొంచం కష్టమవుతుంది కాబట్టి బైనాక్యులర్ ఉపయోగిస్తే గ్రహాలను మరింత స్పష్టంగా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా సూర్యోదయానికి గంట ముందు అయితే గ్రహాల వరుస అద్భుతంగా కనిపిస్తుందంటున్నారు. అందుకే చాలామంది బైనాక్యులర్, టెలిస్కోప్ లను పట్టుకుని ఉత్తర ధృవానికి చేరువగా ఉండే ప్రాంతాలకు వెళుతున్నారు.

More Telugu News