: ముడిచమురు ధరలో సరికొత్త కనిష్ఠం... హరించుకుపోయిన రూ. 1.65 లక్షల కోట్లు

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పతనం ఆగలేదు. బుధవారం నాడు యూఎస్ క్రూడాయిల్ బ్యారల్ ధర సరికొత్త 12 ఏళ్ల కనిష్ఠానికి చేరి 27.92 డాలర్లకు పడిపోయింది. మరింత ముడిచమురు మార్కెట్లలోకి రానుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ (ఐఈఏ) చేసిన హెచ్చరికలతోనే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ అమ్మకాలకే మొగ్గు చూపిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా, సెప్టెంబర్ 2003 లో 28 డాలర్ల వద్ద ఉన్న క్రూడాయిల్ ధర తిరిగి ఆ స్థాయి కన్నా తక్కువకు పతనం కావడం ఇదే తొలిసారి. ఇదిలావుండగా, ఈ ఉదయం భారత స్టాక్ మార్కెట్ 'బేర్'మంది. మంగళవారం నాటి ముగింపు సమయంలో రూ. 92,50,866 కోట్లుగా ఉన్న బిఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, నేడు ఉదయం 11:00 గంటల సమయానికి రూ. 90.86.371 కోట్లకు పడిపోయింది. దీంతో దాదాపు 1.65 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది. ఒకదశలో 400 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ ప్రస్తుతం స్వల్పంగా తేరుకుని 365 పాయింట్ల నష్టంతో 24,115 పాయింట్ల వద్ద, నిఫ్టీ 114 పాయింట్లు దిగజారి 7,320 పాయింట్ల వద్దా నడుస్తున్నాయి. నిఫ్టీ-50లో ఒక్క కంపెనీ మాత్రమే లాభాల్లో నడుస్తోంది.

More Telugu News