ap7am logo

అందమైన కురులను ఇలా కాపాడుకోవాలి!

Sun, Jan 17, 2016, 08:50 AM
అందమైన శిరోజాలు ముఖానికి మరింత అందాన్నిస్తాయనడంలో సందేహం లేదు. ఒత్తిడితో కూడిన రోజువారీ పని, కాలుష్యం తదితరాలతో పాటు తెలిసో తెలియకో చేసే ఎన్నో పనుల వల్ల శిరోజాలు మృదుత్వం కోల్పోయి పాడైపోతాయి. జుట్టు రాలే సమస్యా వెన్నాడుతుంది. దీన్ని నివారించాలంటే...
* అత్యధికులు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, తలస్నానం తరువాత హెయిర్ డ్రయ్యర్ లను వాడటం. జుట్టును త్వరగా ఆరబెట్టుకోవాలన్న ఉద్దేశం, కురుల సహజత్వాన్ని దెబ్బతీస్తుంది. తేమ గుణాలను పోగొట్టి, చర్మానికి హాని చేస్తుంది. హెయిర్ డ్రయ్యర్ ల వాడకానికి దూరంగా ఉండాలి.
* ఇక రోజూ తలస్నానాలతో కూడా ఇబ్బందే. వారంలో మూడు సార్లకు మించి షాంపూ వాడరాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక తలంటుకోవడానికి కనీసం 30 నిమిషాల ముందు నూనెతో మర్దనా చేసుకుంటే, కురుల తేమ తలస్నానం తరువాత కూడా నిలిచేవుంటుంది.
* గట్టిగా ఉండే టవల్స్ తో జుట్టును తుడవటం ద్వారా కొన్ని కురులు రాలిపోతాయి. మెత్తగా ఉండే నూలు టవల్స్ మాత్రమే వాడాలి.
* కురులను ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరించే విటమిన్లు ఏ, సీ, ఈ అధికంగా లభించే ఆహారం తీసుకోవాలి. దీనివల్ల శిరోజాలు మరింత అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
* తలస్నానం తరువాత చిక్కు పడ్డ కురులను వెంటనే సర్దాలని భావిస్తే కొంత జుట్టు ఊడిపోవడం ఖాయం. తడి పూర్తిగా ఆరిన తరువాతనే కురుల చిక్కులను విడదీయాలని, అందుకోసం తొలుత చేతివేళ్లను, ఆపై వెడల్పు పళ్లున్న దువ్వెనలు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ సూచనలు పాటిస్తే, అందమైన కురులు మరింత అందంగా కనిపించడంతో పాటు మరింత కాలం నిలిచివుంటాయి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Garudavega Banner Ad
EX MP Ramesh Rathod Speaks After Joining Congress..
EX MP Ramesh Rathod Speaks After Joining Congress
JC counters police; Dares them to cut his tongue..
JC counters police; Dares them to cut his tongue
Amrapali Appointed As Joint CEO..
Amrapali Appointed As Joint CEO
Chandrababu recall petition rejected; Must attend court on..
Chandrababu recall petition rejected; Must attend court on Oct. 15th
JC Diwakar Reddy Press Conference- LIVE..
JC Diwakar Reddy Press Conference- LIVE
Ex-CBI JD to confirm political entry on Wednesday..
Ex-CBI JD to confirm political entry on Wednesday
T Govt offer to Amrutha: Double bedroom house, fives acres..
T Govt offer to Amrutha: Double bedroom house, fives acres land
Chiranjeevi having fun with family at Azerbaijan- Photo Pl..
Chiranjeevi having fun with family at Azerbaijan- Photo Play
Devadas Official Trailer- Nagarjuna, Nani, Rashmika..
Devadas Official Trailer- Nagarjuna, Nani, Rashmika
T-Movement: Manda exposes Pranab, Gulam Azad..
T-Movement: Manda exposes Pranab, Gulam Azad
Mass Shooting in USA: Woman Kills Three, Turns Gun on Her..
Mass Shooting in USA: Woman Kills Three, Turns Gun on Her
AP Media grudge on Pawan Kalyan not Safe: Telakapalli..
AP Media grudge on Pawan Kalyan not Safe: Telakapalli
Face to Face with Komatireddy Rajgopal Reddy..
Face to Face with Komatireddy Rajgopal Reddy
Special Story: Jagan Vs Vangaveeti in Vijayawada..
Special Story: Jagan Vs Vangaveeti in Vijayawada
CM KCR Strategy: 20 candidates to be Replaced in 105?..
CM KCR Strategy: 20 candidates to be Replaced in 105?
Kalyan Ram political entry in Telangana as MLA ?..
Kalyan Ram political entry in Telangana as MLA ?
BB2: Kaushal wife Thanks Supporters on Daughter's Birthda..
BB2: Kaushal wife Thanks Supporters on Daughter's Birthday
Hamara Prasad Sensational Counter to Kathi Mahesh..
Hamara Prasad Sensational Counter to Kathi Mahesh
I Feel to Protect Nani: Nagarjuna @ Devadas Music Party..
I Feel to Protect Nani: Nagarjuna @ Devadas Music Party
Tongue will be Cut : CI warns JC Diwakar Reddy..
Tongue will be Cut : CI warns JC Diwakar Reddy