: భారతీయుల పొదుపుపై తగ్గనున్న వడ్డీ!

ఇటీవలి కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి సమీక్షల్లో భాగంగా రెపో రేటు (ఆర్బీఐ వద్ద బ్యాంకులు డిపాజిట్ చేసే డబ్బుపై ఇచ్చే వడ్డీ) తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులపై ఉన్న ఒత్తిడిని తొలగించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై ప్రస్తుతం ఇస్తున్న వడ్డీ రేట్లను తగ్గించే నిర్ణయం వెలువడనుందని ఆ శాఖ అధికారులు తెలియజేశారు. వడ్డీ రేట్లను తగ్గించే అంశాన్ని సీరియస్ గా యోచిస్తున్నామని, అంతకన్నా ముందు ఇతర మంత్రిత్వ శాఖలు, ఆర్థికవేత్తలు, బ్యాంకుల అభిప్రాయాలను తీసుకుంటామని వెల్లడించారు. కాగా, 2015లో మొత్తం 1.25 శాతం మేరకు వడ్డీ రేట్లు తగ్గి వచ్చాయి. ప్రస్తుతం నేషనల్ సేవింగ్స్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్రాలు, పోస్టాఫీస్ డిపాజిట్లు, పీపీఎఫ్ ఖాతాలపై వడ్డీ రేట్లు 8.4 నుంచి 9.3 శాతం మధ్య ఉండగా, కనీసం 0.25 నుంచి 0.50 శాతం వరకూ వడ్డీలను తగ్గించాలన్నది ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆలోచనగా తెలుస్తోంది.

More Telugu News