: 'ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్' పాత వర్షన్లకు నేడే ఆఖరట!

మీరు కంప్యూటర్లలో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ద్వారా నెట్ ను వీక్షిస్తున్నారా? అయితే నేడే ఆఖరు. రేపటి నుంచి ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 8, 9, 10 వర్షన్లు పని చేయవు. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ నుంచి ప్రకటన వెలువడింది. జనవరి 12 తరువాత ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ పాత వర్షన్లేవీ పనిచేయవని 'ఐఈ 11' మాత్రమే పనిచేస్తుందని తెలిపింది. కాగా, ఈ నిర్ణయం ఇండియాలోని 90 శాతం కంప్యూటర్లపై పడనుంది. అత్యధిక కంప్యూటర్లలో ఐఈ పాత వర్షన్లను వాడుతుండటంతో వారంతా మరో బ్రౌజర్ కు లేదా ఐఈ అప్ డేటెడ్ వర్షన్ కు వెళ్లక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. కాగా, వైరస్ ల బారి నుంచి కంప్యూటర్లను రక్షించేందుకే పాత వర్షన్లను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.

More Telugu News