: షాంగై 2.51 శాతం, షెన్ జన్ 3.28 శాతం పతనం... అదే దారిలో ఇండియా!

సోమవారం నాటి ఆసియా మార్కెట్లు నష్టాల్లో సాగుతుండటంతో, అదే దారిలో భారత మార్కెట్ పయనం సాగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలో నెలకొన్న మాంద్యం పరిస్థితులు, ఆ దేశ మార్కెట్ ను కుదేలు చేస్తుండగా, నేడు షాంగై కాంపోజిట్ 2.51 శాతం పతనమైంది. దీంతో గత వారం చివర్లో వచ్చిన లాభాలన్నీ మాయం అయ్యాయి. ఇక షెన్ జన్ కాంపోజిట్ 3.28 శాతం పతనమైంది. ఆస్ట్రేలియా ఇండెక్స్ 'ఏఎస్ఎక్స్-200' నేడు 2 శాతం పడిపోగా, ఉత్తర కొరియా సూచిక సోస్పీ ఒక శాతం నష్టపోయింది. కాగా, గత వారంలో చైనా సూచికలు లోయర్ సర్క్యూట్ ను బ్రేక్ చేయగా, ట్రేడింగ్ ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇక భారత మార్కెట్లో ఈ ఉదయం ముందస్తు ట్రేడింగ్ లో సెన్సెక్స్ సూచిక 150 పాయింట్లు కోల్పోయింది.

More Telugu News