: జీరో సైజ్ కావాలనుకుంటున్నారా?

స్థూలకాయులు బరువు తగ్గాలని నిత్యం ఏదో ఒక విధానాన్ని అభ్యసిస్తూనే ఉంటారు. ఒకవైపు వ్యాయామాలు... మరోవైపు ఆహార నియంత్రణ ఆచరిస్తుంటారు. అయితే ఇటీవల వైద్యశాస్త్రవేత్తలు శరీర బరువును తగ్గించే కొన్ని ఆహారాలను వెల్లడించారు. వీటిని తమ డైట్ ప్లాన్ లో భాగంగా చేసుకోవడం ద్వారా ఇట్టే బరువు తగ్గవచ్చని వారు సూచిస్తున్నారు. క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉండే రాస్ఫ్ బెర్రీస్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా గల క్యాబేజీ, ఆకుపచ్చని కూరగాయ అయిన బ్రొకోలీ, విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే చెర్రీలు, గుడ్డులోని తెల్లసొన నిత్యం తీసుకోవడం ద్వారా అత్యంత త్వరగా బరువు తగ్గవచ్చని సూచిస్తున్నారు. మరింకేం, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పైన చెప్పిన జాబితాను ఫాలోకండి!

More Telugu News