: నిద్రలేమి మహిళలలోనే అధికమట!

ఇంటా బయట అనేక సమస్యలతో సతమతమవుతున్న మహిళలు పురుషుల కన్నా అధికస్థాయిలో నిద్రలేమి సమస్యను కూడా ఎదుర్కొంటున్నారని అమెరికాకు చెందిన ఒక సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్లు, 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసుగల మహిళలు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని నేషనల్ సెంటర్ ఫర్ స్లీప్ డిజార్డర్ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. దీనికితోడు మహిళలు గర్భం దాల్చిన తరువాత, మెనోపాజ్ సమయంలో కూడా అధికంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారని వెల్లడైంది. అలాగే వూబకాయం, గుండె సంబంధిత సమస్యలు కూడా నిద్రలేమికి కారణాలుగా తేలింది. అయితే సరైన వ్యాయామంతో ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

More Telugu News