: పఠాన్ కోట్ దెబ్బ... 'బేర్'మన్న మార్కెట్, 350 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!

పఠాన్ కోట్ పై జరిగిన ఉగ్రదాడి భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీయడం, ఆసియా మార్కెట్ల నష్టాలు వెరసి ఈ ఉదయం స్టాక్ మార్కెట్ ను భారీ నష్టాల్లోకి నెట్టింది. ఉదయం 11:10 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 350 పాయింట్లు పతనమై 1.30 శాతం నష్టంలో 25,811 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ అత్యంత కీలకమైన 7,900 పాయింట్ల వద్ద మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతం నిఫ్టీ 105 పాయింట్ల నష్టంతో 7,858 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. కెయిర్న్ ఇండియా, టాటా స్టీల్ లాభాల్లో ఉండగా, ఐడియా, భారతీ ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఒఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, హీరో, మారుతి సుజుకి తదితర కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్ కాప్ మరోసారి కోటి కోట్ల రూపాయల దిగువకు పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ వాటాలను అధికంగా విక్రయిస్తున్నట్టు ఎక్స్ఛేంజ్ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News