: గూగుల్ ద్వారా సొంత వైద్యం వద్దు: నిపుణులు

మనకు పెద్దగా తెలియని ఏ విషయం గురించైనా గూగుల్ లో వెతికేస్తున్నాం. సోషల్ మీడియా ప్రభావం కారణంగా యువతరం ప్రతి అంశాన్ని గూగుల్ సెర్చ్ ద్వారానే తెలుసుకుంటున్నారు. ఈ విప్లవం స్నేహసంబంధాలు పెంచుకోవడంతో ఆగకుండా శాస్త్ర, సాంకేతిక రంగాల గురించిన విషయాలు తెలుసుకునేందుకు కూడా గూగులే గైడ్ గా మారింది. తాజాగా వైద్యానికి కూడా గూగుల్ నే ప్రాధామ్యంగా చేసుకుంటున్నారనే వాస్తవాన్ని వైద్యులు వెల్లడించారు. దీంతో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా పరిస్థితి తయారవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గులకు కూడా గూగుల్ లో మందులను వెతుకుతున్నారని వారు పేర్కొన్నారు. కొన్నిసార్లు వ్యాధుల లక్షణాలు ఒకేలా అనిపించినా అవి పెద్ద ప్రమాదాలకు సంకేతాలు కావచ్చని, చిన్నవే కదా అని నిర్లక్ష్యం చేస్తే పెను ప్రమాదం సంభవించే ఇబ్బంది ఉందని వారు తెలిపారు. అలాగే చిన్న వ్యాధులకు ఎక్కువ పవర్ ఉన్న మందులు వాడకూడదని, అలా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ చూపించే ప్రమాదం ఉందని, అదే సమయంలో సీజనల్ వ్యాధులు ఉంటాయని ఇలా అన్నింటికీ ఒకే మందులు పనికి రావని వారు స్పష్టం చేశారు. గూగుల్ అందుబాటులో ఉంది కదా అని దానిని ప్రతి విషయానికి ప్రామాణికంగా తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

More Telugu News