: నేటి నుంచి అమల్లోకి వచ్చిన నగదు నిబంధనలు ఇవే!

ఆదాయపు పన్ను ఎగ్గొడుతున్న వారికి చెక్ చెప్పడంతో పాటు బ్లాక్ మనీని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. నగదు లావాదేవీలపై ప్రతిపాదించిన ఆంక్షలు ఇవి... * రూ. 50 వేలు దాటిన ప్రతి లావాదేవీకి పాన్ నంబర్ జోడింపు తప్పనిసరి. * పాన్ నంబర్ లేకుంటే, ఫాం-60 అందించాలి. * ఫాం-60లో పేరు, చిరునామా తదితరాల ధ్రువీకరణ పత్రాలు, లావాదేవి విధానాన్ని వివరిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. * తప్పుడు సమాచారం ఇస్తే, కనీసం 3 నెలల నుంచి రెండేళ్ల కారాగార శిక్ష పడుతుంది. * రూ. 50 వేలకు మించి ఎక్కడ బిల్లు చెల్లించినా, విదేశాలకు ప్రయాణ టికెట్లు కొన్నా పాన్ నంబర్ తప్పనిసరి * రూ. 50 వేలకు మించి స్టాక్ మార్కెట్ షేర్లు కొనుగోలు చేసినా... * డీడీలు, బ్యాంకర్స్ చెక్ తదితరాలకు ఒక్క రోజులో రూ. 50 వేలకు మించి చెల్లించినా... * ఏడాదిలో రూ. 50 వేలకు మించి జీవిత బీమా ప్రీమియం కట్టినా... * రూ. 2 లక్షలకు మించి బంగారు నగలు కొన్నా... * రూ. 10 లక్షలకు మించి, ఆస్తులు కొనుగోలు చేసినా, చివరకు కొత్తగా బ్యాంకు ఖాతాను తెరవాలన్నా పాన్ నంబర్ తప్పనిసరి అయింది.

More Telugu News