: కొత్త సెబీ చీఫ్ ఎవరు?... రంగంలోకి దిగిన ప్రధాని కార్యాలయం!

భారత స్టాక్ మార్కెట్ల నియంత్రణా సంస్థ సెబీ (సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)కి తదుపరి చీఫ్ గా ఎవరిని నియమించాలన్న విషయమై ఏర్పాటైన కమిటీ తుది నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయాన్ని తీసుకుంటున్న వేళ, ప్రధాని కార్యాలయం రంగంలోకి దిగింది. ఈ కమిటీలో ప్రధాని కార్యాలయం తరఫున ఓ ప్రతినిధిని చేర్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక శాఖ క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీలో పీఎంఓకు చెందిన ప్రతినిధిని కూడా చేర్చామని, సాధ్యమైనంత త్వరలో సెబీ చీఫ్ పై నిర్ణయం వెలువడుతుందని అధికారులు తెలిపారు. ప్రధానికి అదనపు ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి కమిటీలో ఉంటారని, సెబీ చీఫ్ నియామకంలో ఇప్పటివరకూ పాటిస్తున్న 23 ఏళ్ల నాటి పాత నిబంధనలను సైతం మార్చాలని భావిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ప్రస్తుత సెబీ చీఫ్ యూకే సిన్హా పదవీ కాలం ఫిబ్రవరి 17తో ముగియనున్న సంగతి తెలిసిందే.

More Telugu News