: లాభనష్టాల మధ్య మార్కెట్ స్థిరం

నూతన కొనుగోళ్లు కనిపించినప్పటికీ, అదే స్థాయిలో అమ్మకాలు సైతం సాగడంతో పలుమార్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడిన బెంచ్ మార్క్ సూచికలు దాదాపు స్థిరంగా ముగిశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లు స్వల్ప లాభాల్లో నిలిచాయి. గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 11.59 పాయింట్లు పడిపోయి 0.04 శాతం నష్టంతో 25,838.71 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 4.90 పాయింట్లు నష్టపోయి 0.06 శాతం పతనంతో 7,861.05 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.28 శాతం, స్మాల్ క్యాప్ 0.49 శాతం లాభాలను నమోదు చేశాయి. ఎన్ఎస్ఈ-50లో 28 కంపెనీలు లాభాల్లో నడిచాయి. వీఈడీఎల్, కెయిర్న్, హిందాల్కో, భారతీ ఎయిర్ టెల్, గెయిల్ తదితర కంపెనీలు లాభపడగా, జీ ఎంటర్ టెయిన్ మెంట్స్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్, పీఎన్బీ, హెచ్సీఎల్ టెక్, గ్రాసిమ్ తదితర కంపెనీలు నష్టపోయాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, రూ. 99,36,663 కోట్లకు చేరుకుంది. మొత్తం 2,903 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,556 కంపెనీలు లాభాలను, 1,116 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News