: గ్లోబల్ టాప్-50 కంపెనీల్లో ఒకే ఒక్క భారత సంస్థ!

ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కార్యకలాపాల్లో ముందున్న టాప్-50 సంస్థల జాబితా విడుదల కాగా, అందులో ఒకే ఒక్క భారత సంస్థకు చోటు లభించింది. వార్షిక ఇండస్ట్రియల్ ఆర్అండ్ డీ ఇన్వెస్ట్ మెంట్ స్కోరు బోర్డును యూరోపియన్ కమిషన్ విడుదల చేయగా, వోక్స్ వాగన్ తొలి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇండియాకు చెందిన టాటా మోటార్స్ 49వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఇదే జాబితాలో 104వ పొజిషన్ లో ఉన్న టాటా మోటార్స్, తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరచుకోవడం విశేషం. ఈ జాబితాలో వోక్స్ వాగన్ తరువాత, శాంసంగ్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, నోవార్టిస్ సంస్థలు టాప్-5లో చోటు దక్కించుకున్నాయి. ఇక ఇదే విభాగంలోని టాప్-2500 జాబితాను కూడా యూరోపియన్ కమిషన్ విడుదల చేయగా, 26 భారత కంపెనీలకు చోటు లభించింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన 829, జపాన్ కు చెందిన 360, చైనాకు చెందిన 301, తైవాన్ కు చెందిన 114, స్విట్జర్లాండుకు చెందిన 80, కెనడా, ఇజ్రాయిల్ కు చెందిన 27 కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. ఈ జాబితాలో భారత్ కు చెందిన ఓఎన్జీసీ, టాటా స్టీల్, వోక్ హార్ట్, కాడిలా హెల్త్ కేర్, బజాజ్ ఆటో, హిందాల్కో, బీహెచ్ఈఎల్, పిరామల్ ఎంటర్ ప్రైజస్, విప్రో, హెలియోస్ అండ్ మాథేసన్, హెచ్సీసీ, అశోక్ లైలాండ్, అపోలో టైర్స్, టీసీఎస్, సుజలాన్ ఎనర్జీ, టీవీఎస్ మోటార్, ఫోర్స్ ఇండియా, హెచ్సీఎల్ టెక్, గ్లెన్ మార్క్ తదితర కంపెనీలు నిలిచాయి.

More Telugu News