: అంగారకుడిపై సిలికాను గుర్తించిన క్యూరియాసిటీ రోవర్

అంగారకుడిపై పరిశోధనల నిమిత్తం పంపిన క్యూరియాసిటీ రోవర్ సిలికాను కనుగొన్నట్టు నాసా తెలిపింది. భూమి మీద కనిపించే స్పటికల మాదిరిగానే అంగారకుడిపై కఠినమైన రాయి వంటి సిలికా నిక్షేపాలు ఉన్నట్టు రోవర్ కనుగొందని నాసా ప్రకటించింది. గత ఏడు నెలలుగా క్యూరియాసిటీ రోవర్ తిరిగిన కొన్ని ప్రదేశాల్లో ఈ నిక్షేపాలను గుర్తించినట్టు వారు వెల్లడించారు. ఇది అంగారకుడిపై వాతావరణ పరిశోధనలకు కీలకం కానుందని నాసా ప్రకటించింది. క్యూరియాసిటీ రోవర్ ను అంగారకుడిపైకి పంపిన నాసా, రెండేళ్లుగా అక్కడ జీవయోగ్యమైన వాతావరణం ఉన్నదీ లేనిదీ పరిశోధిస్తోంది.

More Telugu News