: స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ సమస్యను పరిష్కరించనున్న సోనీ

స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోయింది. గేమింగ్, వీడియోలు, సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు వంటివన్నీ స్మార్ట్ ఫోన్ లో చక్కబెడుతుండడంతో బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో 24 గంటల సామర్థ్యమున్న బ్యాటరీ సగం రోజు కూడా పని చేయడంలేదు. దీంతో బ్యాటరీని పటిష్ఠం చేయడంపై సోనీ దృష్టి పెట్టింది. లిథియం-సల్ఫర్, మెగ్నీషియం-సల్ఫర్ మూలకాలను ఉపయోగించి కొత్త తరం బ్యాటరీని రూపొందించింది. ఈ బ్యాటరీ సంప్రదాయ లిథియం బ్యాటరీ కంటే 40 శాతం శక్తిని నిక్షిప్తం చేసుకుంటుందని, తద్వారా స్మార్ట్ ఫోన్ ను ఎక్కువ సమయం వినియోగించుకోవచ్చని సోనీ తెలిపింది. ఈ బ్యాటిరీలు 2020 నుంచి అందుబాటులోకి వస్తాయని సోనీ వెల్లడించింది.

More Telugu News