: నిన్న లాభాలు, నేడు బేల చూపులు!

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు తరువాత, నిన్న లాభాల్లో నిలిచిన భారత మార్కెట్ నేడు నష్టపోయింది. బెంచ్ మార్క్ సూచికలు సెషన్ ఆరంభం నుంచీ క్రమంగా దిగజారుతూ బేల చూపులు చూస్తున్నాయి. ఉదయం 11:15 గంటల సమయంలో సెన్సెక్స్ సూచిక 145 పాయింట్లు పడిపోయి 25,655 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు దాదాపు అన్ని ఆసియా మార్కెట్లూ నష్టపోయాయి. ఆ ప్రభావమే భారత సూచికలపై పడిందని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, నేటి ఆసియా మార్కెట్లలో నిక్కీ 1.25 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.42 శాతం, హాంగ్ సెంగ్ 0.10 శాతం, తైవాన్ వెయిటెండ్ 0.65 శాతం, జకార్తా కాంపోజిట్ 1.54 శాతం పతనం కాగా, యూఎస్ సూచి నాస్ డాక్ ఫ్యూచర్స్ 1.37 శాతం నష్టాల్లో ఉంది.

More Telugu News