: ఏం జరిగినా చూసుకుందాం: ఆర్థికశాఖ

తమ దేశంలో వడ్డీ రేట్లను పెంచుతూ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయం తరువాత ఇన్వెస్టర్లలో ఆందోళనను తగ్గించే ప్రయత్నాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ శ్రీకారం చుట్టింది. వడ్డీ రేట్ల పెంపుదలతో ఆందోళన వద్దని, భారత ఆర్థిక మూలాలు బలంగా ఉన్నవేళ, ఆ ప్రభావం నుంచి తట్టుకోగలమని, ఏదైనా జరిగినా, మార్కెట్ పతనాన్ని అడ్డుకునే నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. "వడ్డీల పెంపు గురించి ముందుగానే సమాచారం ఉన్నందున అన్నింటికీ తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకున్నాం" అని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శశికాంత్ దాస్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. అమెరికా నిర్ణయాలను పాజిటివ్ గా తీసుకుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు వేగంగా ముందుకు సాగవచ్చని, దేశం నుంచి భారీఎత్తున విదేశీ నిధులు బయటకు పోతాయని భావించడం లేదని అన్నారు. స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు స్వల్పంగానే ఉంటాయని భావిస్తున్నట్టు దాస్ తెలిపారు.

More Telugu News